అనంతపురం జిల్లా ప్రజావాణి న్యూస్ (మే04 )కళ్యాణదుర్గం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రయివేటుకు దీటుగా పదిలో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వంద రోజుల ప్రణాళికతో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించిన ప్రతి విద్యార్ధికి శుభాకాంక్షలు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన యువ నాయకుడు,దేశంలో అత్యత్తమ నాయకుల్లో ఒకరిగా ఎదిగిన గొప్ప నాయకుడు నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యకు ప్రత్యేక ఒరవడిని తీసుకువచ్చి విద్యార్థులకు నాణ్యమైన పుస్తకాలు,బట్టలు,బ్యాగులతో పాటు సన్నబియ్యంతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పెట్టి విద్యార్థులలో విద్య పట్ల శ్రద్ద పెట్టేలా చూడటమే కాకుండా ప్రతి పాఠశాలలో కూడా పదవ తరగతి విద్యార్థుల కోసం వంద రోజుల ప్రణాళిక అమలు చేసి నేడు ప్రయివేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించడం చాలా గొప్ప విషయమని ఈ విజయం మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికే దక్కుతుందన్నారు.నేడు నియోజకవర్గంలోని ప్రతి మండలం నుంచి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు,వారి తల్లిదండ్రులను,ఉపాధ్యాయులను పిలిచి విద్యార్థులను ఘనంగా సన్మానించి వారికి కాలేజ్ బ్యాగ్ ను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అందజేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నారా లోకేష్ ప్రభుత్వ బడుల్లో కూడా నాణ్యమైన విద్యతో పాటు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం,డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్,నాణ్యమైన బట్టలు,పుస్తకాలు,షూస్ ఇవ్వడమే కాకుండా ఒక ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుతున్న అందరికి ఒక్కొక్కరికి 15 వేల రూపాయలు తల్లికివందనం అందించి మెరుగైన విద్యకు శ్రీకారం చుట్టారని గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ పేరుతో, బొమ్మలు వేసుకుని ఆనందించారే తప్ప విద్యార్థుల భవిష్యత్ ఆలోచించలేదని,విద్యా శాఖ మంత్రి వంద రోజుల ప్రణాళిక ద్వారా చదువులో వెనుకబడిన వారు సైతం బాగా చదివి ఉన్నత మార్కులు సాధించారని అన్నారు.నారా లోకేష్స్ఫూర్తితో కళ్యాణదుర్గం ప్రాంతంలో అసంపూర్తిగా వదిలేసిన పాలవాయి పాఠశాలను ఎస్సార్సీ ట్రస్ట్ ద్వారా 65 లక్షల రూపాయలు వెచ్చించి పూర్తి చేశామని,శెట్టూరు ఉన్నత పాఠశాలకు 55 లక్షల రూపాయలు విలువ చేసే డెస్కులు అందించామని, అలాగే విద్యార్థులకు క్రీడల్లో కూడా రాణించాలని కేపీఎల్ (కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్) నిర్వహించామని తెలిపారు..లోకేష్ సూర్తితో విద్యార్థులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు..
Homeఆంధ్రప్రదేశ్ప్రభుత్వ బడిలోని విద్యార్థులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే అమిలినేని,,ఉత్తమ మార్కులు సాధించిన ప్రతి విద్యార్ధికి...
ప్రభుత్వ బడిలోని విద్యార్థులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే అమిలినేని,,ఉత్తమ మార్కులు సాధించిన ప్రతి విద్యార్ధికి శుభాకాంక్షలు..
0
7
RELATED ARTICLES
- Advertisment -

