ప్రజా సేవకే నిదర్శనంగా నిలిచిన నాయకత్వం- మంత్రి సీతక్క

ప్రజా సేవకే నిదర్శనంగా నిలిచిన నాయకత్వం- మంత్రి సీతక్క ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) ములుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన పేరు డాక్టర్ సీతక్క. పదవి కోసం ప్రజలను వెతకని నాయకురాలు, ప్రజల కోసం పదవినే సేవగా మార్చుకున్న వ్యక్తిత్వం ఆమెది. అడవుల ఆత్మగా, ఆదివాసీల ఆత్మీయతగా, రైతన్న చెమటకు విలువ తెలిసిన నాయకత్వంగా సీతక్క గుర్తింపు పొందారు. అక్కచెల్లెమ్మల ఆత్మగౌరవానికి అండగా నిలిచి, సబ్బండ వర్గాల అభివృద్ధికే ఆమె కృషి చేస్తున్నారు. ఆమె మాటల్లో నమ్మకం, చేతల్లో సేవ, అడుగుల్లో సమానత్వం...