ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఓటు హక్కును కాపాడుకోవాలి<br>
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే.. ఓటు హక్కును కాపాడుకోవాలి...ఓట్ల తొలగింపు కుట్రను తిప్పికొట్టాలి - ప్రతి కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలిలింగాల తిరుపతినడికూడ,జూన్ 17(ప్రజా వాణి) కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష ఓట్లను లక్ష్యంగా చేసుకొని తొలగిస్తున్న కుట్రను నడికూడ మండల బిఆర్ఎస్ అధికార ప్రతినిధి లింగాల తిరుపతి బుధవారం మండల పార్టీ కార్యాలయంలో తీవ్రంగా ఖండించారు. SIR పేరు తో బెంగాల్‌లో 86 లక్షలు, బీహార్‌లో 46 లక్షల ఓట్లు ఇదే కుట్రలో భాగంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో మండల కేంద్రంలో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు....