
గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్27) మంగళగిరి-తాడేపల్లి –నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు”అనధికార ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్ల నిషేదానికి ప్రజల సహకారం అవ సరం”స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా నగర అందాన్ని కాపాడుదాం”మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో స్వచ్ఛ సర్వేక్షన్ -2026 ” జరుగుతున్న నేపద్యంలో నగరాన్ని శుభ్రంగా, అందంగా ఉంచేందుకు ముఖ్యమైన చర్యలు చేపట్టబడుతున్నాయి.ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నగరపాలక సంస్థ పరిధిలో ఎక్కడైనా వాల్ పోస్టర్లు అంటించడం, అనధికార ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధించబడింది.మంగళగిరి-తాడేపల్లి నగరాన్ని “పోస్టర్ ఫ్రీ సిటీ” గా ప్రకటించడమైనది. ప్రజా గోడలు, భవనాలు, డివైడర్లు, హైవే అండర్ పాస్లు మరియు ఇతర పబ్లిక్ ప్రదేశాలను వాల్ పోస్టర్లు, అనధికారిక చిత్రాలతో పాడుచేయడం చట్టరీత్యా నేరం. ఇటువంటి చర్యలకుపాల్పడిన వ్యక్తులు లేదా సంస్థలపై “ప్రజా ఆస్తి వికృతీకరణ నిరోధక చట్టం ల కింద ల పరిగణించబడుతూ క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు అపరాధ రుసుము విధించబడును.ఇటీవలి కాలంలో నగరంలోని కొన్ని ప్రాంతాలలో అనధికారంగా వాల్ పోస్టర్లు అంటించబడుతున్నట్లు గమనించడమైనది. ఈ నేపథ్యంలో సినిమా థియేటర్స్ యాజమాన్యం, ఇతరులు మరియు ఇతర సంస్థల ప్రతినిధులు ఎట్టి పరిస్థితుల్లోనూ వాల్ పోస్టర్లు అంటించకూడదని ప్రత్యేకంగా సూచించడమైనది.నగర స్వచ్ఛత, సుందరీకరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామిగా నిలిచి, మంగళగిరి-తాడేపల్లి నగరాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడంలో సహకరించవలసినదిగా విజ్ఞప్తి చేయడమైనది.

