
పోరుమామిళ్ల (మే 21 ప్రజావాణి) పోలీస్ స్టేషన్‌లో బీపీ పరీక్షలు నిర్వహణ ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని సందర్బంగా పోరుమామిళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రీవిద్య ఆధ్వర్యంలో పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్స్పెక్టర్ కు అధికారులకు మరియు సిబ్బందికి బీపీ పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా వైద్యాధికారి శ్రీవిద్య మాట్లాడుతూ రక్తపోటు నియంత్రణకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, తక్కువ ఉప్పు వాడాలని,ప్రతిరోజూ వ్యాయామం చేయాలని సూచించారు.అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సాదు వెంకటేశ్వర్లు, Cho ఐశ్వర్య, రేష్మ, ఆశ లు పోలీస్ అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


