ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు నూతన ఆశలు
బెజ్జంకి, మే 2 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని చిలాపూర్ గ్రామంలో అమరాజు కనకయ్యకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ శానగొండ స్వరూప భాస్కరచారి రిబ్బన్ కట్ చేసి ఇంటిని ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సహకారంతో విడతల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామని తెలిపారు. ఎవరూ నిరుత్సాహ పడవద్దని, ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి శానగొండ శరత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పంతం పాపయ్య, పవాడి నాగయ్య, బండిపెల్లి శ్రీకాంత్, రామరాజు నవీన్, అమరాజు కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

