పాలనా వికేంద్రీకరణ కాగితాలకే పరిమితం: కడప నగరానికి మరో తహసీల్దార్ కార్యాలయం ఏది*
కడప జూన్ 10 ప్రజావాణి నగర ప్రజల దశాబ్దాల కల,అదనపు తహసీల్దార్ కార్యాలయం (అర్బన్ మండలం) ఏర్పాటు ప్రతిపాదన కేవలం ఫైళ్లకే పరిమితమైంది.రోజురోజుకూ విస్తరిస్తున్న నగరం,పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పాలనను ప్రజలకు చేరువ చేయాలన్న లక్ష్యం ఇక్కడ అభాసుపాలవుతోంది.2007లోనే దీనికి సంబంధించిన దస్త్రాలు కదిలినా,నేటికీ ఆచరణకు నోచుకోకపోవడం అధికారుల,పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం.నిబంధనలు ఒకటి.క్షేత్రస్థాయి పరిస్థితి మరొకటిసాధారణంగా 30 వేల నుండి 50 వేల జనాభాకు ఒక తహసీల్దార్ కార్యాలయం ఉండాలనేది నిబంధన.కానీ కడప నగర జనాభా లక్షల్లోకి చేరినా,నేటికీ ఒకే ఒక్క కార్యాలయంపై భారం...