📄 ePaper
Friday, June 26, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పామ్ ఆయిల్ -సాగు యాజమాన్య పద్దతుల పైన రైతు శిక్షణా కార్యక్రమం

పామ్ ఆయిల్ -సాగు యాజమాన్య పద్దతుల పైన రైతు శిక్షణా కార్యక్రమం

📰 Generate e-Paper Clip

శ్రీ అవదుతా కాశీనాయన జూన్ 25ప్రజావాణి మండలం సావిశెట్టిపల్లె రైతు సేవ కేంద్రం పరిధిలో నూనెలపై దిగుమతి భారంను తగ్గించుకొనుటకు దేశీయంగా నూనె పంటల సాగును,ఉత్పత్తిని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఉద్యానశాఖ వైస్సార్ కడప జిల్లా మరియు ఆయిల్ పామ్ కంపెనీ సువేన ఆగ్రో ఇండిస్ట్రీస్ సంయుక్తంగా “ఆయిల్ పామ్ సాగు యాజమాన్య పద్దతులపై“ రైతులకు శిక్షణా కార్యక్రమం చేపట్టడం జరిగినది.ఈ కార్యక్రమం లో బాగంగా జిల్లా ఉద్యనాధికారి పి రవి చంద్ర బాబూ మాట్లాడుతూ,పామ్ ఆయిల్ పంట నాటుకునే రైతులు ముందుగా 60సెంటి మీటర్ పొదువు వెడల్పు,లోతుతో కూడిన గుంతలను 9 మీటర్ ఎడము వుండేలా తవ్వుకోవాలి.చతురస్రాకారం పద్దతిలో దాదాపు ఎకరకు 50 మొక్కల చొప్పున నాటుకోవచ్చునని తెలిపారు.12- 14 నెలల వయస్సు కలిగిన ఆరోగ్యమైన మొక్కలను నమ్మకమైన నర్సరీ నుండి కొని,నాటుకోవాలి.నాటేటప్పుడు గుంత వక్కంటికి పాస్పోబాక్టీరియా,అజోస్పైరెల్లియం లాంటి జీవ కారకాలతో వృద్ధి చేయబడిన క్రుళ్లిన సేంద్రీయ ఎరువుతోపాటు 1 కేజి వేప చెక్క, 250 గ్రా.డై అమ్మోనియం ఫాసపేట వేసి మొక్కలు నాటుకోవాలి.పామ్ ఆయిల్ మొక్క వేపుగా పెరిగే మొక్క కావడం వలన సరిపడా నీటి తాడులను ఇవ్వాలి.నీటి వసతి లేని భూముల్లో పంట సాగు చేయకూడదు అని చూచించారు.మొక్క వేర్లు దెబ్బ తినకుండా పాదులను చేసుకోవాలి.నాటిన తర్వాత ఒకసారి గంప సేంద్రీయ ఎరువుతోపాటు,5 కేజి చెక్క తొలకరి వానలు పడే సమయంలో ఇవ్వాలి.అలాగే ప్రతి మూడు నెలలకి ఒకసారి యూరియా,డి.ఏ.పి,పొటాష్ తో కూడిన ఎరువు ఇవ్వాలి.పామ్ ఆయిల్ 18-20 నెలల నుండే పూత రావడం జరుగుతుంది.అయితే మొక్క శాకీయా పెరుగుదల కోసం తొలిదశలో వచ్చే పూతలను తొలగించాలి.30 నెలల తర్వాత మాత్రమే పంటని కాపుకి వాదళాలని తెలిపారు.పామ్ ఆయిల్ పంట ఎక్కువ శాతం పర పరాగ సంపర్కం ద్వారా గెలలు ఏర్పడుట జరుగును కావున తోటలో కీటకాల ను వాడులుట ద్వారా దిగుబడి పెంచుకోవచ్చును అని తెలిపారు.స్థానిక ఉద్యానధికారి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ ఈ పథకం లో బాగంగా ఆయిల్ పామ్ సాగు చేపట్టే రైతులకి హెక్టార్ వక్కంటికి మొక్కలకి దాదాపు రూ.29 వేలు విలువ కలిగిన మొక్కలని రైతులకి అందించబడునని తెలిపారు.పంటసాగుకి నాలుగు సంవత్సరాలలో రూ.21 వేలు రాయితీ రూపంలో అందిస్తారని తెలిపారు.అలాగే పంట తొలి దశలో స్వల్ప కాళిక కూరగాయ,పప్పుదాన్య పంటలని అంతర పంటలుగా సాగు చేసుకుంటే అంతర పంటల సాగుకి సంవత్సరానికి 5250 రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాలలో మరో 21 వేల రూపాయల వరకు ప్రభుత్వం రాయితీ రూపంలో అందిస్తుందని తెలిపారు. అదనంగా పంట పొలం కి ఆంద్రప్రదేశ్ సూక్ష్మ నీటి పారుదల పథకం లో బాగంగా 90 నుండి 50 శాతం రాయితీతో డ్రిప్ పరికరాలను అందిస్తుందన పొలంలో నీటి వనరుల నిర్వహణ కోసం ఫారం పాండ్స్ నిర్మాణం చేపడితే పాండ్ పరిమాణమను బట్టి మరో 90 వేల రూపాయల వరకు రాయితీ కూడా వుంటుందని తెలిపారు.ఇక పండిన పంటను ప్రభుత్వం తో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీ నే ప్రభుత్వం నిర్ణయించిన ధరకు నేరుగా కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. పంట నాటిన 3వ సంవత్సరం నుండి కోతకి వచ్చి దాదాపు 30 సంవత్సరంల వరకు పంట వుంటుందని తెలిపారు.ఇక పొలం కంచె పంటగా వెదురు సాగు చేపట్టడం వలన పొలం లోపల ఆయిల్పామ్ పంట దిగుబడికి దోహదపడుతుందని,వెదురు సాగుకు మొక్క వక్కంటికి 150 రూపాయల వరకు రాయితీ కాలదని తెలిపారు.తదుపరి 2023 సంవత్సరం లో తొలిసారి పంట సాగు చేపట్టిన రైతు వేగి శ్రీనివాసుల పొలం ను రైతులతో కలిసి సందర్చించారు.ఇంకా పూర్తి వివరాల కొరకు,దరకాస్తూ చేసుకొనుటకి రైతులు మీ సమీప రైతు సేవ కేంద్ర సహయకులని గాని,ఉద్యనదికారిని గాని లేదా కంపెనీ ప్రతినిధులని గాని సంప్రదించి తెలుకోవచ్చునని కోరారు.ఈ కార్యక్రమం లో ఇంకా రైతుసేవ కేంద్ర సహాయకులు ఉమా మహేశ్వరి,సురేందరే రెడ్డి,కంపెనీ ప్రతినిదులు కొండా రెడ్డి,డ్రిప్ ఏరియా అధికారి మహేష్,డ్రిప్ కంపెనీ ప్రతినిధులు చంద్ర శేఖర్ రెడ్డి,రైతులు పాల్గొన్నారు.మీ,శ్రీనివాసుల రెడ్డి ఉద్యనాధికారి

RELATED ARTICLES
- Advertisment -

Most Popular