📄 ePaper
Friday, June 26, 2026
📄 ePaper
HomeతెలంగాణWarangalపల్స్ పోలియోను విజయవంతం చేయాలి: వైద్యాధికారి డాక్టర్ సరోజ

పల్స్ పోలియోను విజయవంతం చేయాలి: వైద్యాధికారి డాక్టర్ సరోజ

📰 Generate e-Paper Clip

చెన్నారావుపేట జూన్ 20 ప్రజావాణి

మండల కేంద్రంలో ఈ నెల 28 నుండి 30 వరకు నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైద్యాధికారి డాక్టర్ సరోజ పిలుపునిచ్చారు. శనివారం పీహెచ్‌సీలో నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఆదివారం ఎంపిక చేసిన బూత్‌లలో, సోమవారం నుండి ఇంటింటి సర్వే ద్వారా ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలన్నారు. అలాగే జులై 13న జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం,20న మోపప్ డే నిర్వహిస్తామని తెలిపారు. 1-2 ఏళ్ల పిల్లలకు సగం, 3-19 ఏళ్ల వారికి ఒక మాత్ర మింగించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ పాపమ్మ, సీహెచ్‌ఓ భద్రయ్య, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular