నూతనంగా ఎన్నికైన పదో వార్డ్ కౌన్సిలర్ తూర్పాటి చందన శంకర్ కుటుంబాన్ని కలిసినాకేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్
* సంజయ్ అన్న ఆప్యాయపు పలకరింపు
జమ్మికుంట జూన్ 20 (ప్రజావాణి)
జమ్మికుంట పట్టణంలోని పదో వార్డు కౌన్సిలర్ తూర్పాటి చందన శంకర్ ఇంటికి స్వయంగా వెళ్లి చందన శంకర్ల పాపతో వారి కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించారు ప్రతి కార్యకర్తకు అండగా బండి సంజయ్ ఉంటాడని కష్టకాలంలో భారతీయ జనతా పార్టీ గెలుపే లక్ష్యంగా నిండు గర్భంతో ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన తూర్పాటి శంకర్ చందనను అభినందించారు. తప్పకుండా రానున్న రోజులలో మీరు గొప్ప స్థాయి చేరుకుంటారని ఎప్పుడూ మీకు ఈ సంజయ్ అన్న తోడుంటాడని హామీ ఇచ్చాడు. ఈ కార్యక్రమంలో తూర్పాటి చందన శంకర్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు





