📄 ePaper
Saturday, June 6, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetపర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ సిబ్బందికి ఘన సన్మానం"" పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివీ- సర్పంచ్...

పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ సిబ్బందికి ఘన సన్మానం”” పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివీ- సర్పంచ్ ఎర్రల జానకీ రాజు “

📰 Generate e-Paper Clip

బెజ్జంకి, జూన్ 5 (ప్రజావాణి)

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సిబ్బందికి ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
గ్రామపంచాయతీ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎర్రల జానకి రాజు చేతుల మీదుగా పారిశుద్ధ్య సిబ్బందికి కొత్త బట్టలు, చేతి గ్లౌజులు, చీపుర్లు, విధి నిర్వహణకు అవసరమైన ఇతర సామగ్రిని అందజేశారు. గ్రామ పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో నిరంతరం కృషి చేస్తున్న సిబ్బంది సేవలు అమూల్యమని, వారి అంకితభావం గ్రామ అభివృద్ధికి ఎంతో దోహదపడుతోందని సర్పంచ్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఉప సర్పంచ్ చింతలపల్లి పద్మ, వార్డు సభ్యులు బండి పెళ్లి రమేష్, తడకపెల్లి పవన్, కల్లేపల్లి లక్ష్మీ శ్రీనివాస్, సొల్లు బాలయ్య, గ్రామ కార్యదర్శి పాము రాజేంద్రప్రసాద్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొని సిబ్బందిని అభినందించారు.పర్యావరణ పరిరక్షణ, గ్రామ పరిశుభ్రతలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను గౌరవించడం ద్వారా గాగిల్లాపూర్ గ్రామపంచాయతీ మరోసారి ఆదర్శంగా నిలిచిందని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular