పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ సిబ్బందికి ఘన సన్మానం”” పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివీ- సర్పంచ్ ఎర్రల జానకీ రాజు “

బెజ్జంకి, జూన్ 5 (ప్రజావాణి) ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సిబ్బందికి ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామపంచాయతీ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎర్రల జానకి రాజు చేతుల మీదుగా పారిశుద్ధ్య సిబ్బందికి కొత్త బట్టలు, చేతి గ్లౌజులు, చీపుర్లు, విధి నిర్వహణకు అవసరమైన ఇతర సామగ్రిని అందజేశారు. గ్రామ పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో నిరంతరం కృషి చేస్తున్న సిబ్బంది సేవలు అమూల్యమని, వారి అంకితభావం గ్రామ అభివృద్ధికి...