📄 ePaper
Sunday, July 12, 2026
📄 ePaper
HomeతెలంగాణWarangalనులిపురుగుల నిర్మూలనను జయప్రదం చేయండి 

నులిపురుగుల నిర్మూలనను జయప్రదం చేయండి 

📰 Generate e-Paper Clip

నులిపురుగుల నిర్మూలనను జయప్రదం చేయండి 

వైద్యాధికారిణి డాక్టర్‌ సరోజ

చెన్నారావుపేట జూలై 11 ప్రజావాణి

ఈనెల13న మండలవ్యాప్తంగా చేపట్టే నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారిణి డాక్టర్‌ సరోజ కోరారు.శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ వివరాలను వెల్లడించారు .మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో 3 నుండి 19 ఏళ్ల లోపు వారికి ఉచితంగా అల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.నులిపురుగుల వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపిస్తుందని, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.అనంతరం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీహెచ్‌వో భద్రయ్య, నర్సింగ్‌ ఆఫీసర్‌ ఎస్తేరు, సూపర్‌వైజర్‌ సువార్త, ల్యాబ్‌ టెక్నీషియన్‌ సంజయ్‌, సురేందర్‌, శౌర్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular