📄 ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్నీటి గుంతలో పడి ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి

నీటి గుంతలో పడి ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి

📰 Generate e-Paper Clip

ఖాజీపేట జూన్ 5 ప్రజావాణి మండలం దుంపలగట్టు గ్రామంలో శుక్రవారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వనం సంజన (18), వనం అర్చన (14) అనే అక్కాచెల్లెళ్లు నీటి గుంతలో పడి మృతి చెందారు.పందుల పెంపకమే జీవనాధారంగా ఉన్న వీరు ప్రతిరోజులాగే తమ తల్లి శివవాణి, తమ్ముళ్లు గౌతమ్, కార్తీక్‌లతో కలిసి పందులను మేపేందుకు గ్రామ శివారులోని నీటి గుంత వద్దకు వెళ్లారు.ఈ క్రమంలో ప్రమాదవశాత్తు సంజన, అర్చన నీటి గుంతలో పడి మునిగిపోయారు.సమాచారం అందుకున్న గ్రామస్థులు వెంటనే సహాయక చర్యలు చేపట్టినా అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు తెలిసింది.ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కుమార్తెలు దుర్మరణం చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి

RELATED ARTICLES
- Advertisment -

Most Popular