📄 ePaper
Wednesday, April 15, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్నిందితుడు వెంకటేష్ చేతిలో గాయపడ్డ పోలీసులు..పోలీసులను పరామర్శించిన కడప జిల్లా ఎస్పీ నచికిత్ విశ్వనాథ్

నిందితుడు వెంకటేష్ చేతిలో గాయపడ్డ పోలీసులు..పోలీసులను పరామర్శించిన కడప జిల్లా ఎస్పీ నచికిత్ విశ్వనాథ్

📰 Generate e-Paper Clip

కడప జిల్లా.ప్రజావాణిన్యూస్(ఏప్రిల్11) కాజీపేట మండలం రంగాపురం చెందిన కీర్తన హత్య కేసు నిందితుడు వెంకటేష్ చేతిలో గాయపడ్డ పోలీసులు.పోలీసులను పరామర్శించిన కడప జిల్లా ఎస్పీ నచికిత్ విశ్వనాథ్.మైదుకూరు డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్.డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరిన ఎస్పి.కడప ఎస్పీ నచికిత్ విశ్వనాథ్ కామెంట్స్.కాజీపేట పోలీస్ స్టేషన్ పి సీలు శివయ్య నరసింహులు గాయపడ్డారు.కీర్తన అనే అమ్మాయిని నిందితుడు వెంకటేష్ గోరంగా మర్డర్ చేశారు.ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణం.కీర్తన అనే అమ్మాయి ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువకుడు హత్యకు పాల్పడ్డాడు.చికిత్స కోసం హాస్పిటల్ కి వెళుతూ మార్గమధ్యంలో మరణించింది.నిందితున్ని సురక్షిత ప్రాంతానికి తరలిస్తుండగా పారిపోయాడు.అప్రమత్తమైన కాజీపేట పోలీసులు నిందితుడు కోసం గాలించారు.నిందితుడు పోలీసులపై కత్తితో తిరగబడ్డాడు.మా పోలీసులకు ఈ ఘటనలో గాయాలయ్యాయి.నిందితునికి పోలీసులు హెచ్చరిక జారీ చేశారు.కానీ నిందితుడు సహకరించలేదు.కాజీపేట పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు,ఒక రౌండ్ గాలిలోకి మరో రౌండ్ లో నిందితుడి కాలిపై ఫైర్ చేశారు.నిందితుడికి కాళ్ళకి గాయమై చికిత్స కోసం రిమ్స్ కు తరలించడం జరిగింది.కడప జిల్లాలో మహిళలకు ఎటువంటి నేరాలకు పాల్పడిన పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటాం.పోలీసుల మీద తిరగబడితే ధైర్యంగా ఎదుర్కొంటాం చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.మహిళల రక్షణ రౌడీషీటర్లపై గట్టి చర్యలు పోలీసులు తీసుకుంటాం.క్రిమినల్ లను ఎవరిని కూడా కడప పోలీసులు ఉపేక్షించరు.మృతురాలి తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది.నిందితునికి శిక్షపడేందుకు చర్యలు తీసుకుంటాం.ప్రభుత్వం నుండి పోలీసుల నుండి ఉన్నతాధికారుల నుండి కుటుంబానికి అండగా ఉంటాం.క్రిమినల్ చర్యలకు పాల్పడితే కడప పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటాం.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular