📄 ePaper
Tuesday, June 2, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriనారపల్లిలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నారపల్లిలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

పోచారం, జూన్ 2: పోచారం మున్సిపాలిటీ 8వ డివిజన్ నారపల్లి సెంటర్‌లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గౌరవ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆదేశానుసారం, పోచారం మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మందాడి సురేందర్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, 1400 మంది అమరుల ఆత్మబలిదానాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని గుర్తు చేశారు. తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ఆశయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా వెనుకబడుతోందని ఆరోపిస్తూ, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే శక్తి బీఆర్ఎస్‌కే ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పోచారం మున్సిపల్ మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ రెడ్డియా నాయక్, నల్లవెల్లి శేఖర్ ముదిరాజ్, ఘట్కేసర్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రమేష్, మాజీ కౌన్సిలర్లు సుర్వి రవీందర్, బెజ్జంకి హరిప్రసాద్, మాజీ కోఆప్షన్ సభ్యుడు అక్రమ్ అలీ, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి శేఖర్ ముదిరాజ్, మాజీ సర్పంచ్ ఓరుగంటి వెంకటేష్ గౌడ్, సామల సందీప్ రెడ్డి, బద్దం జగన్మోహన్ రెడ్డి, నర్రి కాశయ్య, ఉద్యమకారుడు పంగా అయోధ్య రామయ్య, అబ్బావతిని నరసింహ, కె.ఎం. రెడ్డి, మీసాల రాజేష్, బైరి ఐలయ్య, సుర్వి శ్రీనివాస్, నారపల్లి మాజీ సర్పంచ్ జాదవ్ శేషరావు, జితేందర్ నాయక్, సురేష్ నాయక్, లక్ష్మీనారాయణ, నీరుడి శ్రీనివాస్, దుర్గారాజు శ్రీనివాస్ రెడ్డి, షబ్బీర్ అలీ, యోగానంద గౌడ్, మోటుపల్లి శ్రీనివాస్, కొమ్ము ప్రశాంత్, సామల విజయభాస్కర్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular