📄 ePaper
Tuesday, June 2, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriతెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆర్థిక సాయం అందించిన సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆర్థిక సాయం అందించిన సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, జూన్ 2 (ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నోజిగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్న ముగ్గురు విద్యార్థులను గుర్తించి, ప్రముఖ సామాజిక సేవకుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆర్థిక సాయం అందజేశారు.

విద్యార్థులు ఉన్నత చదువులు కొనసాగించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఆర్థిక ఇబ్బందులు విద్యాభ్యాసానికి అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో ఈ సహాయం అందించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. ప్రతాప్ రెడ్డి (జీహెచ్‌ఎం), ఉపాధ్యాయులు ఎ. రామదాసు (ఎస్‌ఏ), టి. భవాని (ఎస్‌ఏ), ఎం. అమరేశ్వరి (ఎస్‌ఏ), పి. రాజు (ఎస్‌ఏ), ఎం. విజయకుమార్ (పీఈటీ) తదితరులు పాల్గొని సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సేవాభావాన్ని అభినందించారు.

విద్యార్థుల భవిష్యత్తు కోసం సమాజంలోని దాతలు ముందుకు రావడం అభినందనీయమని పలువురు అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular