📄 ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
HomeతెలంగాణSuryapetనకిలీ ఎరువుల తయారీ ముఠా అరెస్ట్. సుమారు 2 కోట్ల విలువైన 4 వేల...

నకిలీ ఎరువుల తయారీ ముఠా అరెస్ట్. సుమారు 2 కోట్ల విలువైన 4 వేల బస్తాల పైగా నకిలీ డిఏపి సీజ్.

📰 Generate e-Paper Clip

నకిలీ ఎరువుల తయారీ ముఠా అరెస్ట్.

సుమారు 2 కోట్ల విలువైన 4 వేల బస్తాల పైగా నకిలీ డిఏపి సీజ్.

6 గురు నిందితుల అరెస్ట్ చేసిన మఠంపల్లి పోలీస్.

మఠంపల్లి జూలై 31 (ప్రజావాణి)

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నందు జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలు అరెస్టు వివరాలు వెల్లడించిన కోదాడ డివిజన్ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి.

నఖిలీ డి ఏ పి (అడుగుమందు) తయారుచేసి, అమాయకులు అయిన రైతులను మోసం చేస్తూ అమ్ముతున్నా ముఠా గుట్టు రట్టు చేసిన మట్టంపల్లి పోలీసులు.

రైతుల అవసరాలు అదునుగా చేసుకొని రైతులను మోసం చేయాలని ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులు ఒక గ్రూపుగా ఏర్పడి నకిలీ డి ఏ పి తయారుచేసి అమాయకులైన రైతులను మోసం చేయాలని ఉద్దేశంతో అధిక ధరలకు ఎక్కువ మొత్తంలో డిఏపి కట్టలు అందుబాటులో ఉండే విధంగా చేసి రైతులను ఏమార్చి అక్రమ సంపాదన చేసి చేసినవారిని అన్ని ఆధారాలతో పట్టుకున్న హుజూర్నగర్ సీఐ జి. చరమందరాజు మరియు మట్టంపల్లి ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్, వారి సిబ్బంది.

తేదీ: 15.07.2026 రోజు మట్టంపల్లి మండల వ్యవసాయ అధికారి అయిన బొలిశెట్టి శ్రీనివాస్ వారికి వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు మట్టంపల్లి మండలంలోని రఘునాధపాలెం గ్రామం కొండేటి పిచ్చిరెడ్డి అనునతను నఖిలి డి ఏ పి కట్టలను రైతులకు అమ్మితున్నాడు అనే సమాచారం మేరకు వారు విచారణ జరిపి కొండేటి పిచ్చిరెడ్డి రైతులకు అమ్మిన డి ఏ పి కట్టలను నఖిలీవి అని నిరారణ అయినది అని అతనిపై మరియు ఇట్టి నేరానికి సమబందించిన వారిపై చట్టరీత్యా చర్యగురించి మట్టంపల్లి పోలీసు స్టేషన్ నందు ధరఖాస్తు ఇవ్వగా, మట్టంపల్లి ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసిన తరువాత హుజూర్నగర్ సిఐ జి. చరమందరాజు ఈ కేసును విచారణ చేయగా తీగ లాగితే డొంక కదిలిన చందాన విస్తుపోయే నిజాలు బయట పడినవి.

ఈ రోజు తేదీ 30.07.2026 రోజు నమ్మదగిన సమాచారం మేరకు మొదటి నేరస్తుడు అయిన కొండేటి పిచ్చిరెడ్డి ని రఘునాధపాలెం గ్రామం నంధు పట్టుబడి చేసి అతన్ని విచారించి అతని ఒప్పుకోలు ప్రకారం మహేశ్వర్ రెడ్డిని బక్కమంతులగూడెం గ్రామం నందు అరెస్ట్ చేసి వారివురి ఒప్పుకోలు ప్రకారం మిగిలిన నాలుగురు నేరస్తులను పెద్ద అంబర్ పేట వద్ద అందరూ కలిసి కోర్టును ఆశ్రయించి కోర్ట్ వారినుండి బెయిల్ పొందుటగురించి ప్రణాళికలు వేస్తుండగా వారిని కూడా పట్టుబడిచేయనైనది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular