ప్రజావాణి :కడప జిల్లా,శ్రీ అవదూత కసినాయన మండలం, గంగనపల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు దిలీప్ అత్యంత కిరాతక హత్యకు గురైన ఘటన ప్రతి మనిషి మనసును కలచివేసింది. ఒక అమాయక యువకుడిని పెట్రోల్ పోసి దహనం చేయడం అనేది మానవత్వానికి మచ్చ. ఇది కేవలం ఒక కుటుంబానికి జరిగిన విషాదం మాత్రమే కాదు… మన సమాజానికి జరిగినఅవమానం.ఈ దారుణ ఘటనపై కడప డీసీసీ బ్యాంక్ చైర్మెన్ శ్రీ మంచురి సూర్యనారాయణ రెడ్డి గారు తీవ్రంగా స్పందించారు. మంగళవారం శ్రీ అవధూత కాశి నాయన మండలం లోని గంగనపల్లి గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులను ధైర్యం చెప్పి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.కొడుకుని కోల్పోయిన ఆ తల్లిదండ్రుల వేదన వర్ణించలేనిది. వారి కన్నీళ్లు చూసిన ప్రతివారూ కలత చెందకుండా ఉండలేరు. ఈ కష్టసమయంలో కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇస్తూ, తన వంతుగా తక్షణ సహాయంగా రూ.50,000 ఆర్థిక సాయం అందజేశారు. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు వారి వెంటే మేమున్నాం అనే నమ్మకానికి చిహ్నం.ఈ అమానుషానికి పాల్పడిన దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేసి, చట్టపరంగా అత్యంత కఠినమైన శిక్ష విధించాలని పోలీసులను ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. నిందితులు ఎంతటి ప్రభావం ఉన్న వారైనా సరే చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు విశ్రమించేది లేదని, బద్వేల్ టీడీపీ నాయకత్వం కుటుంబం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని తెలిపారు.మన కూటమి ప్రభుత్వం దళితుల రక్షణకు కట్టుబడి ఉందని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుండి అందాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు ఆర్థిక సహాయం, న్యాయ సహాయం, భద్రత త్వరగా అందేలా చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. సమాజంలో ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు అవసరమని అన్నారు.ఈ కార్యక్రమంలో బద్వేల్ నియోజకవర్గ యువనాయకులు చెరుకూరి రవికుమార్, డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్, అరవ శ్రీనివాసులు, భిరం జయరామిరెడ్డి, బాలిరెడ్డి, ప్రహల్లదరెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మొగల్ర హమతుల్లా, రామయ్య, శంకర్ రెడ్డి, సిద్ధారెడ్డి, క్రిష్ణారెడ్డి, సుబ్బారాయుడు యాదవ్, కరుణాకర్, సమరసింహారెడ్డి, వివరమిరెడ్డి, షేక్ రఫీ, సురేంద్ర,పగిడి సందీప్,మిట్ట వంశీ తదితరులు పాల్గొని బాధిత కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు.
దళితుల కుటుంబాలకు అండగా ఉంటాం సూర్యనారాయణ రెడ్డి
0
130
Previous article
Next article
RELATED ARTICLES
- Advertisment -




