తోటపల్లి గ్రామంలో ఘనంగా 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు
బెజ్జంకి, ఏప్రిల్ 14 (ప్రజావాణి):
సిద్దిపేట జిల్లా, బెజ్జంకి మండల పరిధిలోని తోటపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కవ్వంపల్లి అశ్విని–శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పాలక వర్గంతో కలిసి నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బందిని గ్రామ ప్రజలు మరియు పాలకవర్గ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాంపల్లి శంకర్, మాజీ సర్పంచ్ దుగ్యాని కనుకయ్య, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.




