📄 ePaper
Friday, July 17, 2026
📄 ePaper
HomeతెలంగాణSuryapetతుమ్మగూడెం బిఆర్ఎస్ నాయకుడు పై సస్పెండ్ వేటు...!! !!పార్టీని బలహీనపరిచే కార్యక్రమాలే కారణం..!! ...

తుమ్మగూడెం బిఆర్ఎస్ నాయకుడు పై సస్పెండ్ వేటు…!! !!పార్టీని బలహీనపరిచే కార్యక్రమాలే కారణం..!! !!పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన ప్రతి వారిపై ఇవే చర్యలు ఉంటాయి భవిష్యత్తులో..!!

📰 Generate e-Paper Clip

తుమ్మగూడెం బిఆర్ఎస్ నాయకుడు పై సస్పెండ్ వేటు…!!

!!పార్టీని బలహీనపరిచే కార్యక్రమాలే కారణం..!!

!!పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన ప్రతి వారిపై ఇవే చర్యలు ఉంటాయి భవిష్యత్తులో..!!

ప్రజావాణి ,మోతె, మే 13:
మండల పరిధిలోని తుమ్మగూడెం గ్రామపంచాయతీలో బిఆర్ఎస్ పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన విరండి పాపా చారి అనే గ్రామ నాయకుడు పై సస్పెండ్ వేటు పడింది. పార్టీ సిద్ధాంతాలకు పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని
భారతీయ రాష్ట్ర సమితి గ్రామ శాఖ కార్యవర్గం గ్రామ శాఖ అధ్యక్షులు కుక్క బిక్షం గౌడ్. బుధవారం తుమ్మగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు, మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు యాదవ్ కు ఇతనిపై ఫిర్యాదు చేసి అధిష్టాన అభీష్టం మేరకు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకే వీరండీ పాపచారి అనే ఇతనిని శాశ్వతంగా పార్టీ సభ్యత్వము నుండి రద్దుచేసి, పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లుగా తుమ్మగూడెం బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కార్యవర్గం తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ కార్యవర్గ సభ్యులు గ్రామ శాఖ అధ్యక్షులు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular