డ్రైనేజ్ సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు: తోటకూర వజ్రేష్ యాదవ్
ఘట్‌కేసర్, జూన్ 30: పోచారం మున్సిపాలిటీ పరిధిలోని నారపల్లి గ్రామంలోని టీచర్స్ కాలనీ, బాబానగర్ కాలనీల్లో నెలకొన్న డ్రైనేజ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ఘట్‌కేసర్ సర్కిల్ కమిషనర్, ఏఈ విశేష్ నాయక్, రంగనాయక్‌లు స్థానిక నాయకులతో కలిసి కాలనీల్లో పర్యటించి డ్రైనేజ్ సమస్యలను పరిశీలించారు. సమస్యల తీవ్రతను తెలుసుకుని, తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ...