📄 ePaper
Friday, July 17, 2026
📄 ePaper
HomeతెలంగాణRangareddyజూన్ 25 నుంచి తెలంగాణలో SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో...

జూన్ 25 నుంచి తెలంగాణలో SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ BLAలు గ్రామ స్థాయిలో ఓటర్ జాబితాపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఓటర్ల జాబితాలో అర్హుల పేర్లు మాత్రమే ఉండేలా చూడటం కాంగ్రెస్ పార్టీ BLAల బాధ్యత — కొందుర్గు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోగురి పురుషోత్తం రెడ్డి

📰 Generate e-Paper Clip

Writing
జూన్ 25 నుంచి తెలంగాణలో SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ BLAలు గ్రామ స్థాయిలో ఓటర్ జాబితాపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి.
ఓటర్ల జాబితాలో అర్హుల పేర్లు మాత్రమే ఉండేలా చూడటం కాంగ్రెస్ పార్టీ BLAల బాధ్యత
— కొందుర్గు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోగురి పురుషోత్తం రెడ్డి
ఈ రోజు కొందుర్గు మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో మండల తహసీల్దార్ అజం ఆలీ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన SIR అవగాహన సదస్సులో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోగురి పురుషోత్తం రెడ్డి పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటర్ల జాబితాలో అర్హుల పేర్లు మాత్రమే ఉండేలా చేయడానికే “SIR” కార్యక్రమం నిర్వహిస్తున్నారని, అనర్హుల పేర్లు ఉండటానికి అవకాశం లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రతి ఓటరు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనేలా కాంగ్రెస్ పార్టీ BLAలు గ్రామ స్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 2002లో SIR సర్వే నిర్వహించగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే మొదటిసారి ఈ సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే అధికారులు 2002 నాటి మరియు తాజా ఓటర్ల జాబితాలను BLOలకు అందజేశారని పేర్కొన్నారు.
ఓటర్లకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉందన్నారు. జులై 31న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు లేకపోయినా, సర్వేలో పాల్గొనలేకపోయినా, లేదా తమ వివరాలు నమోదు చేసుకోలేకపోయినా… జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు నిర్వహించే అభ్యంతరాలు, ఫిర్యాదుల సమయంలో ఫారం-6 సమర్పించి తమ పేరును నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
కొత్త ఓటర్లు కూడా ఇదే ఫారం-6 ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular