📄 ePaper
Saturday, June 13, 2026
📄 ePaper
HomeతెలంగాణJagtialఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా విగ్రహ నిర్మాణానికి భూమి పూజ

ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా విగ్రహ నిర్మాణానికి భూమి పూజ

📰 Generate e-Paper Clip

పిల్లర్ నిర్మాణానికి సామాగ్రి అందజేస్తనన్న సర్పంచ్ మహేందర్ రెడ్డి

ప్రజలకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి ఫిబ్రవరి 19 (ప్రజావాణి):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలోని హైవేపై గల బస్టాండ్ ఆవరణలో ఈ రోజు చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శివాజీ విగ్రహ ఏర్పాటుకొరకు స్థానిక గ్రామ సర్పంచ్ జిరెడ్డి మహేందర్ రెడ్డి, గ్రామపంచాయతీ పాలకమండలి, శివాజీ విగ్రహ కమిటీ సభ్యులు, యువకులు, గ్రామ పెద్దలు మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణం కొరకు భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ…. విగ్రహ ఏర్పాటుకు తన వంతు సహాయంగా కావలసిన పిల్లర్, స్లాబ్ నిర్మాణం వరకు అవసరమైన నిర్మాణ సామాగ్రిని అందజేస్తానని హామీ ఇచ్చారు, గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారికి వీలైనంతలో చందాలు అందించాలని కోరారు, శివాజీ విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులను ఎప్పటికప్పుడు చందాల ఆదాయ, వ్యయాలను బహిర్గతం చేయాలని, పార్టీలకతీతంగా కలసికట్టుగా విగ్రహ నిర్మాణం పూర్తి చేయాలని కమిటీ సభ్యులకు సూచనలు తెలిపారు. అనంతరం భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజల దాహార్తి తీర్చడానికి సర్పంచ్ మహేందర్ రెడ్డి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు, గ్రామంలోని మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ కుల సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular