ములుగు జిల్లాలో 640 అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ప్రారంభం
ములుగు జిల్లా బ్యూరో గొల్లపెల్లి లక్ష్మీ (ప్రజావాణి)
ఈ రోజు నుండి ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు (ఆగస్టు 1–7) ములుగు జిల్లాలోని 640 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ (అంగన్‌వాడీ) సంయుక్త ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలు మరియు అంగన్‌వాడీ కేంద్రాల లబ్ధిదారులకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
రాబోయే 10 రోజుల పాటు SHG సమాఖ్య సంఘాల మహిళలకు, అలాగే డిగ్రీ, నర్సింగ్ మరియు మెడికల్ కళాశాల విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వివిధ అవగాహన కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టబడతాయి. తల్లిపాల వల్ల కలిగే ప్రయోజనాలు, పుట్టిన గంటలోపు శిశువుకు తల్లిపాలు ఇవ్వడం, మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వడం, తల్లి మరియు శిశువు ఆరోగ్యానికి తల్లిపాల ప్రాధాన్యత, సరైన పోషకాహారం, శిశు సంరక్షణ వంటి అంశాలపై విస్తృతంగా అవుతాయని కల్పించబడుతుంది.

ములుగు జిల్లాలో ప్రస్తుతం 1,429 మంది గర్భిణులు మరియు 682 మంది బాలింతలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా చురుకుగా పాల్గొని తల్లిపాల ప్రాముఖ్యతను తెలుసుకొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ అధికారి శ్రీమతి ఈ.పీ. ప్రేమలత గారు మరియు సంబంధిత అధికారులు కోరారు.
బై రిపోర్టర్ గొల్లపెల్లి శ్రీకాంత్.. లక్ష్మీ




