📄 ePaper
Monday, April 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్చెరువును ఆక్రమించితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు...రెవెన్యూ డివిజనల్ అధికారి

చెరువును ఆక్రమించితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు…రెవెన్యూ డివిజనల్ అధికారి

📰 Generate e-Paper Clip

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్18) శ్రీ అవధూత కాశినాయన మండలం పరిధిలోని సావిశెట్టిపల్లె మరియు కత్తరగాండ్ల రెవిన్యూ గ్రామంలో బొక్కినేరు( కొండ్రజూపల్లి చెరువు) విస్తీర్ణము 151.10 ఎకరములకు భూసేకరణ ద్వారా చెరువు నిర్మాణము చేపట్టడం జరిగింది.గతములో శ్రీయుత రెవెన్యూ డివిజనల్ అధికారి, బద్వేల్ వారి ఆదేశముల మేరకు ఈ చెరువు ఆక్రమణలు తొలగించి, 151.10 ఏకారముల విస్తీర్ణమకు తేదీ: 04.03.2025 న ట్రెంచ కొట్టడం జరిగినది.ఇటీవల కాలంలో సదరు చెరువు నందు సావిశెట్టిపల్లె రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబర్ 1085, 1086 నందు గల భూమి ఆక్రమణకు గురి అయినదని రెవెన్యూ అధికారులు గుర్తించడం జరిగినది.శ్రీయుత రెవెన్యూ డివిజనల్ అధికారి, బద్వేల్ వారి మరియు శ్రీ అవధూత కాశి నాయన మండల తాసిల్దార్ వారి ఆదేశముల మేరకు తేదీ: 18.04.2026 న సదరు ఆక్రమణను మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వేయర్, గ్రామ సర్వేయర్ మరియు వీఆర్వో డోజర్ సహాయముతో 0.86 ఎకరాలు అరటి తోటను తొలగించడం జరిగినది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular