చిలుకూరులో ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన సిమెంట్ లారీ*

*చిలుకూరు జూలై 22(ప్రజావాణి*):చిలుకూరు మండలం సీతారాంపురం స్టేజీ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మిర్యాలగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మిర్యాలగూడ నుంచి కోదాడ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.బస్సు సీతారాంపురం స్టేజీ వద్ద ప్రయాణికులను ఎక్కించుకుంటుండగా, వెనుక నుంచి అతివేగంతో వచ్చిన హుజూర్‌నగర్‌కు చెందిన పార్థసారథి ట్రాన్స్‌పోర్టు సిమెంట్ లారీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో మొత్తం 68 మంది ప్రయాణికులు ఉన్నారు. లారీ బస్సును వెనుక నుంచి బలంగా...