📄 ePaper
Tuesday, May 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్చిలకలూరిపేటలో దారుణం పాత కక్షల సెగ ఏకంగా 8 కత్తిపోట్లు

చిలకలూరిపేటలో దారుణం పాత కక్షల సెగ ఏకంగా 8 కత్తిపోట్లు

📰 Generate e-Paper Clip

 

గుంటూరు జిల్లా జిల్లా ప్రజావాణి న్యూస్ (మే07) చిలకలూరిపేట పట్టణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.ఎప్పుడు రద్దీగా ఉండే సాయి కార్తీక సిటీ సెంటర్ సమీపంలోని టీ షాప్ వద్ద పట్టపగలే కిరాతకమైన హత్యాయత్నం జరిగింది. పబ్లిక్ లో జరిగిన ఈ భయంక భయానక కత్తి దాడి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సిమెంట్ పనులు చేసుకుంటూ జీవనం సాగించే షేక్ జాన్ బాషా ఎప్పటిలాగే టీ కొట్టు వద్ద ప్రశాంతంగా టీ తాగుతున్నాడు.ఈ క్రమంలో పాత కక్షలు మనసులో పెట్టుకున్న గుర్రాల చావిడికి చెందిన బషీర్ (వెల్డింగ్ వర్కర్)అకస్మాత్తుగా అక్కడికి చేరుకున్నాడు.ఊహించని విధముగా సుభాని నగర్ కు చెందిన జాన్ బాషా పై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు.ఏకంగా ఎనిమిది సార్లు కత్తితో పొడిచి తన పైశాచికత్వాన్ని ప్రదర్శించి అక్కడి నుండి పరారయ్యాడు.స్థానికులు వెంటనే అప్రమత్తమై 108 కి సమాచారం అందించారు.హుటావోటీనో ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది క్షతగాత్రుని దీని ప్రాథమిక చికిత్స నిమిత్తం చిలకలూరిపేట వైద్యశాలకు తరలించారు. అయితే మెడ భాగంలో బలమైన గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాణాలను కాపాడేందుకు ఎమర్జెన్సీగా మెరుగైన వైద్య సేవ కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ దారుణానికి వడిగట్టి పరారైన వెల్డింగ్ వర్కర్ బషీర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular