ఘాట్ కేసర్ లో 22.3 సెంటీమీటర్ల వర్షపాతం.. గాలివాన బీభత్సం
ఘట్‌కేసర్, మే 25 (ప్రజావాణి): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలో సోమవారం కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఘట్‌కేసర్, కొండాపూర్, ఎన్‌ఎఫ్‌సీ నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. రోడ్లపై చెట్లు పడిపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా ఘట్‌కేసర్ పరిధిలో 22.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఎమ్మార్వో చంద్రశేఖర్ తెలిపారు. విద్యుత్ తీగలపై చెట్లు పడటంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఒక్కసారిగా వీచిన బలమైన గాలులతో స్థానికులు భయాందోళనకు...