📄 ePaper
Thursday, June 25, 2026
📄 ePaper
HomeతెలంగాణWarangalఘనంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

ఘనంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

📰 Generate e-Paper Clip

చెన్నారావుపేట జూన్ 24 ప్రజావాణి

మండల పరిధిలోని జల్లి గ్రామంలో భూక్య సంతోష్-సంధ్య దంపతుల నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ కేతిడి వీరారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సామాన్య ప్రజల సొంతంటి కలను ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తోందని, గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. లబ్ధిదారుల కళ్ళలో ఆనందం చూస్తుంటే ప్రభుత్వ ఆశయం నెరవేరినట్లు అర్ధమవుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బాదావత్ బాలు నాయక్, వెంకటేశ్వర్లు, భద్రయ్య, కిషన్, రవి, రాజు, భిక్షం, విజేందర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular