గులాబీ గూటికి చేరిన గడ్డం సోదరులు
-సుందిల్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని పరిణామాలు.
-ఇటీవల సోషల్ మీడియా ఇంచార్జి హరీష్ రెడ్డి.. నేడు గడ్డం సోదరులు పార్టీ మార్పు.
-మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిక.
రామగిరి,మన సమగ్ర ప్రజావాణి జూన్ 17
రామగిరి మండలం సుందిల్ల గ్రామంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు వరుసగా పార్టీని వీడి ప్రతిపక్ష బీఆర్ఎస్‌లో చేరడం స్థానిక రాజకీయాల్లో చర్చ నీయాంశంగా మారింది.ఇటీవల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జిగా పనిచేసిన హరీష్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరగా,తాజాగా గడ్డం సంతోష్,వెంకటేష్ సోదరులు కూడా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు చేతుల మీదుగా బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.ఈ చేరికలతో సుందిల్ల గ్రామ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామంలో బీఆర్ఎస్ తన బలాన్ని మరింత పెంచుకునే ప్రయత్నాలు చేస్తుండగా, అధికార కాంగ్రెస్ పార్టీ వరుస చేరికలను నిలువరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.ఈ పరిణామాలు రానున్న స్థానిక రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.





