గుగ్గిళ్ల గ్రామంలో వెలగని వీధి విద్యుత్ దీపాలు – 2వ వార్డు ప్రజలు అవస్థలు
బెజ్జంకి, ఆగస్టు 3 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలోని 2వ వార్డులో వీధి విద్యుత్ దీపాలు రాత్రి సమయంలో వెలగకపోవడంతో వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం కావడంతో రాత్రివేళ చీకట్లు అలుముకుని ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్న పరిస్థితి నెలకొంది.చీకటి కారణంగా రోడ్డుపైకి ఏదైన విషసర్పాలు,ఇతర విషపురుగులు సంచరించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు రాత్రి సమయంలో...