📄 ePaper
Wednesday, April 22, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetగుండారంలో ఘనంగా బిజెపి 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

గుండారంలో ఘనంగా బిజెపి 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

గుండారంలో ఘనంగా బిజెపి 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

బెజ్జంకి, ఏప్రిల్ 6(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుండారం గ్రామంలో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ బూత్ అధ్యక్షులు(తెలంగాణ వార్డు సభ్యుల సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు)గుండారం గ్రామ 7వ వార్డు సభ్యులు ఎలుక శ్రీశైలం బిజెపి జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,1980 ఏప్రిల్ 6న స్థాపించబడిన భారతీయ జనతా పార్టీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీలలో ఒకటిగా ఎదగడం గర్వకారణమని అన్నారు. పార్టీ బలోపేతానికి సాధారణ కార్యకర్తలే ప్రధాన శక్తి అని, దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ బిజెపి ఉపాధ్యక్షులు కందిరాజు కోరుకోప్పుల యాదయ్య, నాయకులు ఎలుక రాజు, గొడ్డాటి శ్రీను, కోనేటి శ్రీకాంత్, బొప్పన కుంటయ్య, కంది రమేష్, ఉత్కం రాములు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular