గాగిల్లపూర్‌లో పోచమ్మ తల్లి ఆలయానికి ముదిరాజ్ సంఘం రూ.50,000 విరాళం
బెజ్జంకి, ఏప్రిల్ 11(ప్రజావాణి )
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లపూర్ గ్రామంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న పోచమ్మ తల్లి ఆలయానికి ముదిరాజ్ సంఘం వారు రూ.50,000 విరాళాన్ని అందజేశారు.ఈ విరాళాన్ని గ్రామ సర్పంచ్ ఏర్రల జానకి-రాజు, ఉపసర్పంచ్ పద్మ, గ్రామపంచాయతీ పాలకవర్గం సమక్షంలో అందించారు.ఆలయ అభివృద్ధికి మద్దతుగా ముందుకు వచ్చిన ముదిరాజ్ సంఘం సభ్యులకు గ్రామపంచాయతీ పాలకవర్గం,గ్రామస్థులు కృతజ్ఞతలు తెలియజేశారు.
