📄 ePaper
Friday, August 7, 2026
📄 ePaper
HomeతెలంగాణNizamabadకోటగిరి,పోతంగల్ సెక్టార్లలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు.

కోటగిరి,పోతంగల్ సెక్టార్లలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు.

📰 Generate e-Paper Clip

కోటగిరి,పోతంగల్ సెక్టార్లలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు.

మహిళా ఆరోగ్యమే సమాజ ఆరోగ్యం.

సిడిపిఓ నందిని.

తల్లిపాల శక్తి ఏమిటో పోచారం శ్రీనివాస్ రెడ్డి గారే నిదర్శనం.

ఏపిఎం భాస్కర్.

ముర్రె పాలు బిడ్డకు తొలి రక్షణ కవచం(టీకా).

పీఎచ్ఎన్ఓ కృష్ణవేణి.

తల్లిపాలు బిడ్డలకు అమృతం.

ఐసిడిఎస్ సూపర్వైజర్లు కొమరవ్వ,వెంకటరమణమ్మ.

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0;
algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 39;

 

 

కోటగిరి/ప్రజావాణి:-తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్య సమాజం నిర్మాణం అవుతుందని బోధన్ ఇంచార్జ్ ఐసిడిఎస్ సిడిపిఓ నందిని పేర్కొన్నారు.నేటి వరకు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆరోగ్యంగా ఉన్నారంటే అది ఆయన చిన్నప్పుడు తల్లిపాలు తాగడం వల్లనేనని,ఈ విషయం ఆయన ప్రతి వేదికపై చెబుతూ ఉంటారని ఉమ్మడి కోటగిరి మండలం ఐకెపి ఎపిఎం భాస్కర్ గుర్తు చేశారు.ముర్రె పాలు బిడ్డకు తొలి రక్షణ కవచం,పుట్టిన గంటలోపు తల్లి ముర్రె పాలు తాగించడం అంటే బిడ్డకు సహజ టీకా వేసినట్టేనని వర్ని మండల పీఎచ్ఎన్ఓ కృష్ణవేణి అన్నారు.తల్లిపాలు బిడ్డలకు అమృతంతో సమానమని కోటగిరి పోతంగల్ మండలాలకు చెందిన ఐసిడిఎస్ సూపర్వైజర్లు కొమరమ్మ, వెంకటరమణ అన్నారు.తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా కోటగిరి,పోతం గల్ సెక్టార్ పరిధిలోని గర్భిణులు,బాలింతల కు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం పోతంగల్ మండల కేంద్రంలోని సాయిబాబా ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బోధన్ ఇంచార్జ్ సీడీపీఓ నందిని ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం గర్భిణులకు శ్రీమంతం,చిన్నారులకు అన్న ప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా సిడిపిఓ నందిని,పీఎచ్ఎన్ఓ కృష్ణ వేణి,ఐకేపి ఏపిఎం భాస్కర్,సూపర్వైజర్లు కొమరమ్మ వెంకటరమణ మాట్లా డుతూ.బిడ్డ పుట్టినప్పటి నుండి 6 నెలల వరకు బిడ్డకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి.తల్లి పాలు ఇవ్వడం వల్ల తల్లీబిడ్డల మధ్య అనుబంధం పెరుగు తుందన్నారు.బిడ్డకు 2 గంటలకు ఒకసారి పాలు ఇవ్వాలనీ.పోతపాలు తాగించ డం వల్ల బిడ్డ బలహీనపడతాడని అన్నారు.పుట్టిన గంట లోపు బిడ్డకు తల్లి ముర్రె పాలు తాగించాలనీ.బిడ్డను వెచ్చ గా తల్లి వద్ద ఉంచాలనీ.శిశువు పుట్టిన దగ్గర నుండి 2 సం.ల వయస్సు వరకు బిడ్డ జీవితంలో 100 0 గోల్డెన్ డేస్ అని.ఈ సమయంలో తీసుకునే పోషకాహారమే బిడ్డ భవిష్య త్తును నిర్ణయిస్తుంది అన్నారు.తల్లిపాలు తాగించడం వల్ల రొమ్ము క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయని తెలిపారు.బాలింతలు పోషకాలతో కూడిన ఆహారం తీసు కోవాలనీ,గర్భంతో ఉన్నప్పుడు మంచి విషయాలు వినడం, రామాయణం,మహాభారతం వంటి ఆధ్యాత్మిక సినిమాలు చూడాలన్నారు.బిడ్డకు పాలిచ్చేట ప్పుడు పాటలు,శ్లోకాలు చెబుతూ బిడ్డను నిమరాలి అని సూచించారు.గర్భిణులు, బాలింతలు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒకపూట సంపూర్ణ భోజనం తప్పనిసరిగా చేయాలనీ అన్నారు.5 సం.ల వరకు పిల్లలను అంగన్‌వాడీలో చేర్పిస్తే ఆటపాటల ద్వారా వారు విద్యను నేర్చుకుంటారని అన్నా రు.ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే ప్రకారం 100 మందిలో 57 శాతం మంది మాత్రమే ముర్రె పాలు తాగిస్తున్నారని,ఇంకా చాలా మందిలో అవగాహన తక్కువగా ఉందని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కల్లూరి సంధ్యారాణి హన్మండ్లు,వార్డ్ మెంబర్ సంధ్య,ఏఎన్ఎం శివభాయి,ఐకెపి.సిసి.సాయి బాబా,కోటగిరి,పోతంగల్ మండలాలకు చెందిన అంగన్‌ వాడీ టీచర్లు,ఆశా వర్కర్లు,గర్భిణులు,బాలింతలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular