📄 ePaper
Thursday, July 23, 2026
📄 ePaper
HomeతెలంగాణJagtialకొడిమ్యాలలో ఘనంగా బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు

కొడిమ్యాలలో ఘనంగా బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

*కొడిమ్యాలలో ఘనంగా  బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు..*

మన ప్రజావాణి చొప్పదండి నియోజకవర్గం జూలై 22:

కొడిమ్యాల మండల కేంద్రంలో బుధవారం రోజున కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి  స్వీట్లు పంపిణీ చేసి  లాంగ్ లివ్ వినోద్ అన్న అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.
అనంతరం పులి వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ కరీంనగర్  స్మార్ట్ సిటీ ప్రధాత, కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి వారి సేవలు చేసే విధంగా ఆ భగవంతుడు ఆశీర్వదించాలన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొత్తూరి స్వామి, రైతుబంధు మాజీ అధ్యక్షులు, ఐక్య సంఘం అధ్యక్షులు అంకం రాజేశం, మాజీ ఎంపీటీసీ సభ్యులు  గడ్డం చంద్రమోహన్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ బైరి వెంకటి,  నాయకులు దోమకొండ నరసయ్య, నేరెళ్ల రాజయ్య, మొగిలిపాలెం శ్రీనివాస్,చెల్లా లక్ష్మణ్, సుంకే  నరేష్, మోహన్, ఇంతియాజ్, ఈసంపల్లి రమేష్, మార్గం వెంకట నరసయ్య, తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular