కేబీఆర్ క్రిస్పీ చికెన్ 46వ బ్రాంచ్ ప్రారంభించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి
ఘట్కేసర్, జూలై 27: ఘట్కేసర్ మండల పరిధిలో కేబీఆర్ క్రిస్పీ చికెన్ 46వ బ్రాంచ్‌ను మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు రిబ్బన్ కట్ చేసి నూతన బ్రాంచ్‌ను ప్రారంభించి, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపార రంగంలో మరిన్ని విజయాలు సాధిస్తూ ప్రజలకు నాణ్యమైన ఆహార సేవలు అందించాలని ఆకాంక్షించారు. కేబీఆర్ క్రిస్పీ చికెన్ వ్యవస్థాపకులు నాగ ప్రభాకర్, నిర్వాహకులు శ్రవణ్, మనోజ్ గౌడ్ అతిథులను ఘనంగా ఆహ్వానించి సత్కరించారు. వ్యాపార విస్తరణలో...