📄 ePaper
Saturday, July 25, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriకేటీఆర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు – ఎస్‌ఐఆర్ అవగాహన రథానికి శ్రీకారం

కేటీఆర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు – ఎస్‌ఐఆర్ అవగాహన రథానికి శ్రీకారం

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్, జూలై 24: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని ఘట్కేసర్ పట్టణంలో ఘట్కేసర్ మండల మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు.

అనంతరం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాన్ని ఎలా నింపాలి, నింపిన దరఖాస్తులను ఎక్కడ సమర్పించాలి వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి ఆదేశాల మేరకు అవగాహన రథాన్ని ప్రారంభించారు. ఈ రథం ద్వారా ప్రజల్లో ఓటరు నమోదు ప్రక్రియపై విస్తృత అవగాహన కల్పించనున్నట్లు నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, సహకార బ్యాంకు డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి, మాజీ కౌన్సిలర్లు చందుపట్ల వెంకటరెడ్డి, బండారి ఆంజనేయులు గౌడ్, నాయకులు బొక్క విష్ణువర్ధన్ రెడ్డి, వరికుప్పల లింగస్వామి, మందాడి శ్రీనివాస్ రెడ్డి, బొంత సుధాకర్, రోడ్డ యాదగిరి, భోగ అర్జున్, బిజిలి సదానందం, రాధాకృష్ణారెడ్డి, అబ్బగొని నాగరాజ్ గౌడ్, భానుక నవీన్, రాజేష్ గౌడ్, మనోజ్ గౌడ్, అశోక్ గౌడ్, లక్ష్మయ్య, మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఎండీ సిరాజ్, వైద్య సిబ్బంది, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular