📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కాశినాయన మండలంలో వైఎస్ఆర్సీపీకి భారీ షాక్.. రితేష్ రెడ్డి సమక్షంలో టీడీపీలోకి 20 కుటుంబాల చేరిక

కాశినాయన మండలంలో వైఎస్ఆర్సీపీకి భారీ షాక్.. రితేష్ రెడ్డి సమక్షంలో టీడీపీలోకి 20 కుటుంబాల చేరిక

📰 Generate e-Paper Clip

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే06) బద్వేల్ కాశినాయన:రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రజారంజక పాలనను చూసి,అలాగే స్థానికంగా బద్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ శ్రీ కె.రితేష్ రెడ్డి ప్రజల సమస్యల పట్ల స్పందిస్తున్న తీరుకు ఆకర్షితులై వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు సాగుతున్నాయి.కాశినాయన మండలం,ఇటుకలపాడు పంచాయతీ కొట్టాలపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.రితేష్ రెడ్డి సమక్షంలో సుమారు 20 కుటుంబాలు వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి.కాశినాయన మండలం సొసైటీ అధ్యక్షుడు బంగారు గురువు రెడ్డి, కొట్టాలపల్లి టీడీపీ నాయకుడు కె.మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రితేష్ రెడ్డిపార్టీలో చేరిన వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.పార్టీలో చేరిన వారు:ఎం.నారాయణరెడ్డి,ఎం మల్లికార్జున్రెడ్డి,వి.కేశవరెడ్డి,కే వెంకటరామిరెడ్డి,ఎం.నర్సింహులు,జి.పోలయ్య,ఎం.వెంకటసుబ్బయ్య, ఎం. రవీంద్రారెడ్డి,వి.పెద్ద ఖాదర్ రెడ్డి,జినాగరాజు,కే.కృష్ణారెడ్డి, వీరయ్య,పోలయ్య,దేవినేని కృష్ణారెడ్డి మరియు ఇతర కుటుంబ సభ్యులు.ఈ సందర్భంగా రితేష్ రెడ్డి మాట్లాడుతూ:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారదర్శక పాలన పట్ల ప్రజల్లో పూర్తి నమ్మకం ఏర్పడిందని,అందుకే స్వచ్ఛందంగా టీడీపీలోకి వస్తున్నారని తెలిపారు.నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉంటూ పరిష్కరించడమే తన బాధ్యత అని, పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి,రోహిత్ రెడ్డి బాలయ్య పల్లె కృష్ణారెడ్డి దుగ్గిరెడ్డి రామచంద్రయ్య నాయుడు రామ సుబ్బారెడ్డి రమణారెడ్డి ఎల్ ఎస్ బి డ్యామ్ చైర్మన్ ఈగ వెంకట రమణ రెడ్డి బద్వేలు మండల పార్టీ అధ్యక్షుడు బసిరెడ్డి రవికుమార్ రెడ్డి బద్వేల్ మాజీ ఎంపీపీ ప్రతాపరెడ్డి రంగసముద్రం పంచాయతీ ఎంపీటీసీ కల్వకూరి రమణ మండల స్థాయి నాయకులు,గ్రామ ముఖ్య నేతలు మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular