📄 ePaper
Tuesday, August 4, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కలసపాడు 1 బి లో అసైన్మెంట్ పట్టాల భూములకు హద్దులు చూపించాలి*వ్యాకాసా ధర్నా*

కలసపాడు 1 బి లో అసైన్మెంట్ పట్టాల భూములకు హద్దులు చూపించాలి*వ్యాకాసా ధర్నా*

📰 Generate e-Paper Clip

కలసపాడు (ఆగస్టు 4 ప్రజావాణి )మండలం పరిధిలో కలసపాడు గ్రామం పుల్లారెడ్డి గ్రామం,కొంగల రామాపురం గ్రామాల పేదలకు దళితులకు 2008 సంవత్సరంలో అసైన్మెంట్ ఆమోదం పొందిన పట్టాలకు కలసపాడు 1-బి లో సర్వే చేసి హద్దులు చూపించాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పేదలు ధర్నా నిర్వహించారు.మంగళవారం ఉదయం కలసపాడు తాసిల్దార్ కార్యాలయం వద్ద సామాజిక శంఖారావం లో భాగంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలసపాడు గ్రామం పుల్లారెడ్డి పల్లె గ్రామం కొంగల రామాపురం గ్రామాలలో దళితులు పేదలకు 2008 సంవత్సరంలో అసైన్మెంట్ కమిటీలో ఆమోదం పొందిన పట్టా భూములకు సర్వే చేసి హద్దులు చూపించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్ డిమాండ్ చేశారు.పలుకుబడే కలిగిన రాజకీయ నాయకులు కలసపాడు వన్ బి లో దొంగ పట్టాలు సృష్టించుకుని ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి పట్టాలు పొందిన పేదలకు హద్దులు చూపించి భూములు చూపించాలన్నారు. పుల్లారెడ్డి పల్లె గ్రామం దళిత పేటలో సిమెంట్ రోడ్డు లేక చిన్నపాటి వర్షానికే నీళ్లు నిలువ ఏర్పడి విషద్వరాలు ప్రబలుతున్నాయి వెంటనే కూటమి ప్రభుత్వం దళితపేటలో సిమెంట్ రోడ్లో నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. కొండపేట గ్రామం దళితుల స్మశానాన్ని అగ్రవర్ణాల ఆక్రమించారు సర్వే చేసి దళితులకు స్వాధీనం చేయాలని కోరారు.రాజుపాలెం గ్రామం, మల్లువారిపల్లె గ్రామాలలో దళిత కాలనీలలో సిసి రోడ్లు వేయాలి.శంఖవరం గ్రామం ఎస్టి కాలనీలో స్మశానం స్థలం లేక వంకలు గట్ల వద్ద చనిపోయిన శవాలను పూడుస్తున్నారు.స్మశానానికి స్థలం ఏర్పాటు చేయాలని తాసిల్దారును కోరారు.ఉపాధి హామీ చట్టం పనులు చేసిన వాటికి మూడు వారాల డబ్బులు నెల రోజులు నుంచి జమ చేయలేదని తెలిపారు.శంఖవరం కలసపాడు రామాపురం తెల్లవాడు కొండపేట తెల్లపాడు పుల్లారెడ్డి పల్లె గ్రామాలలో దళితులు పేదలు సెంటు భూమి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికేతర్లకు రాజకీయ పలుకుబడి కలిగిన వారికి అనోహురులు ప్రభుత్వ భూములు పొందారు ఆ భూములను విచారించి ప్రభుత్వం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.అనంతరం కలసపాడు తాసిల్దారు రవీంద్రారెడ్డి కి వినతిపత్రం సమర్పించారు.ఈ ధర్నా కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు కారు యర్జ మండల కార్యదర్శి లాజరస్ సుదర్శన్ నతానియల్ శేఖర్ హుస్సేన్ పీరా నాగ శేషమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular