కరెంట్ అధికారులు నిర్లక్ష్యానికి యువకుడు బలి.
మఠంపల్లి ఆగస్టు 6 (ప్రజావాణి)
కరెంట్ అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ షాక్ తగిలి యువకుడు మృతి చెందిన సంఘటన రామచంద్రపురంలో జరిగింది.
స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన మాలోతు మణికంఠ (16) తండ్రీ కేవలా పొలంలో నాట్లు వేయిస్తుండగా పక్క పొలంలోని మాలోతు అంజయ్య (35) తండ్రి మీటియా అనే వ్యక్తి మాలోతు మణికంఠకు ఫోన్ చేసి పొలానికి పిలిపించి కరెంట్ వైర్లు కిందకి వేలాడుతున్నాయి, నువ్వు నా ట్రాక్టర్ మీద కూర్చుని చేతులు పైకి ఎత్తు నేను ఫోటో తీస్తాను. కరెంటు డిపార్ట్మెంట్ వాళ్లకు పంపిద్దామని చెప్పి మాలోతూ అంజయ్య మాలోతూ మణికంఠ ను పిలిపించాడు. కరెంటు గురించి తెలియని మాలోతూ మణికంఠ మాలోతు అంజయ్య ట్రాక్టర్‌పై కూర్చొని చేతులు పైకి ఎత్తగానే కరెంటు వైర్ చాలా కిందికి ఉండడంతో చేతులకు తగిలి వెంటనే కరెంట్ షాక్ తగిలి కింద పడిపోయాడు. కింద పడిపోయిన మణికంఠ ను పక్కకు తీసి చూడగా కరెంటు షాక్ తగిలిన వెంటనే చనిపోయాడని తెలిసింది. విషయం తెలుసుకున్న మఠంపల్లి ఎస్సై ప్రవీణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మణికంఠ మరణంతో రామచంద్రపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.



