
ప్రొద్దుటూరు మే17 ప్రజావాణి ప్రసిద్ధ ఆలయం వాసవి కన్యకాపరమేశ్వరి దేవి (అమ్మవారిశాల) అమ్మవారిని సందర్శించుకున్న మాజీ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మరియు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు ఆలయ విశిష్టతను వెల్లంపల్లి గారికి వివరించడం జరిగింది. ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులు వెల్లంపల్లి, రాచమల్లు గారిని మరియు పులివెందుల ఆర్యవైశ్య నాయకులు కరుణాకర్ గారిని సాధార ఆహ్వానం పలికిన అనంతరం వారిని సత్కరించడం జరిగింది.దర్శనం అనంతరం ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వెల్లంపల్లి గారు మాట్లాడుతూ విజయవాడ తరహా అభివృద్ధిని ప్రొద్దుటూరులో రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గారు అభివృద్ధి చేయడం చూసి చాలా ఆనందం కలిగిందని, జగన్ మోహన్ రెడ్డి హయాంలో ప్రొద్దుటూరు నుంచి తమ ఆర్యవైశ్య సోదరులైన చిప్పగిరి ప్రసాద్ గారిని మరియు మారుతి ప్రసాద్ గారిని తిరుమల దేవస్థానం డైరెక్టర్లు గా చేసిన ఘనత రాచమల్లు గారికి దక్కిందాన్నారు. ఇంకా రాచమల్లు గారు మాట్లాడుతూ చంద్రబాబు సంపద సృష్టిస్తానని చెప్పి ఇప్పుడు అదేపనిగా పెట్టుకొని ముగ్గురు, నలుగురు పిల్లల్ని కనమని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎద్దేవా చేసారు.ఇంకా ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిని పలువురు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు



