📄 ePaper
Saturday, April 25, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కోరుకొండ మండలంలో చలివేంద్రాలు ఏర్పాటు.....

కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కోరుకొండ మండలంలో చలివేంద్రాలు ఏర్పాటు…..

📰 Generate e-Paper Clip

తూర్పుగోదావరి జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్25) రాజానగరం నియోజకవర్గం,కోరుకొండ, మండలంలో విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు,ఆధ్వర్యంలో మజ్జిగ, త్రాగునీటి చలివేద్రాలు ఏర్పాటు చేసారు.కోరుకొండ రాజమండ్రి ప్రధాన రహదారిలోని రామసేన కార్యాలయం వద్ద,జంబూపట్నం నరసాపురం,గాదరాడ రహదారిలోని జంబూపట్నం వినాయక అలయం వద్ద ఏర్పాటు చేసిన,మజ్జిగ,త్రాగ నీటి చలివేద్రాలను రామసేన సభ్యులు,బీజేపీ నాయకులు శనివారం ప్రారంభించారు.ప్రస్తుతం వేసవికాలం కావడంతో ప్రజల దాహార్తి తీర్చడం కోసం,చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని,వాటిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కంబాల శ్రీనివాసరావు,పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నాగరమేష్,వీరాంజలి,రాయపాటి సత్యనారాయణ,పనగంటి రాంబాబు,చింతల కన్నారావు,పలకం శెట్టి శ్రీను, రామసేన సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular