📄 ePaper
Monday, July 27, 2026
📄 ePaper
HomeతెలంగాణJagtialఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్

ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్

📰 Generate e-Paper Clip

ప్రజావాణి కొడిమ్యాల: రూ.80 వేల లంచం తీసుకుంటూ ఎఫ్‌ఆర్‌ఓ మొయినొద్దీన్ పట్టుబాట్టబడ్డాడు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని ఫారెస్ట్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.80 వేల లంచం తీసుకుంటుండగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్‌ఆర్‌ఓ) మొయినొద్దీన్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం.

ఫిర్యాదు మేరకు పక్కా ప్రణాళికతో వల పన్నిన ఏసీబీ అధికారులు, లంచం స్వీకరిస్తున్న సమయంలోనే అధికారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో కొడిమ్యాల ఫారెస్ట్ శాఖలో కలకలం రేగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular