ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి – పోచారం డివిజన్ కాంగ్రెస్ నాయకుల పిలుప
పోచారం, జూలై 24(ప్రజావాణి): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను వేగవంతం చేసి ప్రతి అర్హ ఓటరు వివరాలు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు, ఎన్యూమరేషన్ ఫారాలు సక్రమంగా నింపడం, వాటిని సంబంధిత అధికారులకు అందజేయడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రె రాజేష్, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, బీఎల్ఏలు, బీఎల్వోలు వినోద్ కుమార్, వంగాల లక్ష్మీ, గౌరి, శశికళ, నాగరాజు, మధు, రమేష్, గండమల్ల రమేష్, ఆంజనేయులు గౌడ్, యు. వెంకటేష్, పావని తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అర్హులైన ఓటర్లు తమ వివరాలను సకాలంలో నమోదు చేసుకోవాలని నాయకులు కోరారు.





