📄 ePaper
Tuesday, May 12, 2026
📄 ePaper
HomeతెలంగాణKarimnagarఇందుర్తిలో కుంట కట్ట రోడ్డు నిర్మాణానికి శ్రీకారం

ఇందుర్తిలో కుంట కట్ట రోడ్డు నిర్మాణానికి శ్రీకారం

📰 Generate e-Paper Clip

మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి): హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. గ్రామంలోని కుంట కట్ట రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ చింతపూల నరేందర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామ ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు కల్పించడమే లక్ష్యంగా ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో కుంట కట్ట ప్రాంతంలో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ రోడ్డు నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.గ్రామ అభివృద్ధి దిశగా మరిన్ని మౌలిక వసతుల పనులు చేపట్టేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పుల్లూరి రాజు, బొడిగ పరశరాములు, బుర్ర పరశురాములు, కొడకండ్ల సాంబమూర్తి, కున మల్లయ్య, డాక్టర్ రాజేందర్, చింతపూల ఆంజనేయులు, యువకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత గ్రామానికి మరింత సౌకర్యం కలుగుతుందని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular