ఇందుర్తిలో కుంట కట్ట రోడ్డు నిర్మాణానికి శ్రీకారం

మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి): హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. గ్రామంలోని కుంట కట్ట రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ చింతపూల నరేందర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామ ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు కల్పించడమే లక్ష్యంగా ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో కుంట కట్ట ప్రాంతంలో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ రోడ్డు నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.గ్రామ అభివృద్ధి దిశగా మరిన్ని మౌలిక వసతుల పనులు...