ఆపదలో ఉన్న జర్నలిస్టుకు రూ.10 వేల ఆర్థిక సాయం, అండగా నిలిచిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి
ఘట్కేసర్, జూన్ 29: ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఘట్కేసర్ డివిజన్ పరిధిలోని పోచారం సర్కిల్ 8వ వార్డు రాజీవ్ గృహకల్ప కాలనీలో నివసిస్తున్న జర్నలిస్ట్ సంజయ్ కుమార్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని ఆయనకు రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పోచారం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు దేవేందర్ ముదిరాజ్, స్థానిక కాంగ్రెస్ కార్యకర్తల ద్వారా విషయం తెలుసుకున్న శ్రీకాంత్ రెడ్డి వెంటనే...