📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అర్హులైన వృద్ధులకు వితంతులకు కొత్త పెన్షన్లు ప్రభుత్వం మంజూరు చేయాలి..

అర్హులైన వృద్ధులకు వితంతులకు కొత్త పెన్షన్లు ప్రభుత్వం మంజూరు చేయాలి..

📰 Generate e-Paper Clip

అర్హులైన వృద్ధులకు వితంతులకు కొత్త పెన్షన్లు ప్రభుత్వం మంజూరు చేయాలి..


ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం ఏప్రిల్ 28.


పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కునవరం మండలం:- సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం కూనవరం లోని శ్రీ మార్త శ్రీరామమూర్తి భవన్లో జిల్లా కమిటీ సభ్యులు మేకల నాగేశ్వరావు అధ్యక్షతన జరిగింది.. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమ, సామాజిక పథకాలను కొత్త పింఛన్లు ఇస్తూ 2024 నుంచి ఇప్పటివరకు ఎవరికీ కొత్త పెన్షన్ ఇవ్వకుండా పాత పెన్షన్ దారులతో ఫోటో ఫోజులు ఇస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అర్హులైన ఎస్టీ, ఎస్సీ,బీసీ వెనుకబడిన వారికి రెండు సంవత్సరాలు బట్టి ఎందుకు పెన్షన్ ఇవ్వడం లేదు ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. సామాజిక పెన్షన్ అంటే పేదలకు ఇచ్చే పెన్షన్ దీని ఇప్పటివరకు ఇవ్వకుండా సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేయడం అనడం అంటే అబద్దాలతో పరిపాలన కొనసాగిస్తుందని ఎద్దేవా చేశారు. వయసు మీద పడిన వృద్ధులు ఆసరాని లేని వితంతువులకు ఏ ప్రభుత్వం అయినా కేంద్రమైన రాష్ట్రమైన ఇవ్వాల్సిందే.దీనికి ఇవ్వకుండా కాలయాపన చేయడం ఎంతవరకు సబబు అని విమర్శించారు. వృద్ధులకు వితంతువులకు కొత్త పెన్షన్లు తక్షణమే మంజూరు చేయకపోతే వృద్ధులు వితంతువులతో కలిసి సిపిఎం పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బాబు బొర్రయ్య,జిల్లా కమిటీ సభ్యులు పాయం సీతారామయ్య, మడకం నాగమణి,మండల కమిటీ సభ్యులు పాయం సత్యనారాయణ, తెల్లం తమ్మయ్య, ఆవుల ఉపేందర్ రావు కర్నాటి శ్రీనివాసరావు బొగ్గ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular