📄 ePaper
Monday, June 22, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అమెరికా నుంచి స్వగ్రామానికి సేవా పురస్కార సౌరభం

అమెరికా నుంచి స్వగ్రామానికి సేవా పురస్కార సౌరభం

📰 Generate e-Paper Clip

ప్రభుత్వ పాఠశాలల SSC టాపర్లకు ఘనంగా ప్రతిభా పురస్కారాల అందజేత

పోరుమామిళ్ల.(ప్రజావాణి జూన్ 20) రాజధాని తుళ్లూరు జన్మభూమిపై మమకారంతో అమెరికాలో స్థిరపడిన ఎన్నారై గడ్డం వెంకటరమణ తన ఉదారతను చాటుకున్నారు. తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పోరుమామిళ్ల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి, పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. స్థానిక SPS ఫంక్షన్ హాల్‌లో విద్యా వెలుగులు నింపేలా ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది.స్థానిక ఉపాధ్యాయుడు శ్రీనివాసులు,సతీమణి సుహాసిని ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పురస్కారాల ప్రధానోత్సవానికి జిల్లా విద్యాశాఖాధికార శంషుద్దీన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.నగదు బహుమతులు మరియు ప్రశంసా పత్రాలు:మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు డీఈవో చేతుల మీదుగా నగదు బహుమతులతో పాటు, ప్రశంసాపత్రం మరియు మెడల్స్‌ను ప్రదానం చేశారు.మొదటి బహుమతి:రూ. 7,116/-రెండూ బహుమతి: రూ. 5,116/-*మూడో బహుమతి: రూ. 3,116/-ముఖ్య అతిథి డిఇఓ శంషుద్దీన్ఈ  సందర్భంగా డీఈవో శంషుద్దీన్ మాట్లాడుతూ.చదువుతో పాటు తల్లిదండ్రులను, గురువులను గౌరవించడమే విద్యార్థులకు నిజమైన విజయం. అమెరికాలో ఉన్నప్పటికీ తన జన్మభూమిని మరిచిపోకుండా,ఎన్నారై గడ్డం వెంకటరమణ చాటుకున్న సేవా దృక్పథం అందరికీ ఆదర్శనీయం”అని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఇలా ప్రోత్సహించడం వారిలో మరింత పట్టుదలను పెంచుతుందని పేర్కొన్నారు.ఈ విద్యా పురస్కారాల మహోత్సవంలో మండల విద్యాశాఖాధికారులు , వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రతిభ కనబరిచిన విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular